: సెటిలర్లకు పెద్ద పీట... గ్రేటర్ ఎన్నికలకు టీఆర్ఎస్ మలి జాబితా
గ్రేటర్ పీఠాన్ని కైవసం చేసుకోవాలని భావిస్తున్న అధికార తెలంగాణ రాష్ట్ర సమితి వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన సెటిలర్లను తన పార్టీ అభ్యర్థులుగా పేర్కొంటూ మరో జాబితాను విడుదల చేసింది. నామినేషన్ల దాఖలుకు నేడు ఆఖరి రోజు కావడంతో వీరంతా ఆఘమేఘాలపై నామినేషన్ల దాఖలుకు బయలుదేరారు. తుది జాబితాలో సరూర్ నగర్ - పి.అనిత, నల్లకుంట - జి.శ్రీదేవి, అంబర్ పేట - పి. జగన్, వనస్థలిపురం - జిట్టా రాజశేఖరరెడ్డి, నాగోలు - సీహెచ్ సంగీత, హస్తినాపురం - పద్మానాయక్, చంపాపేట - సామ రంగారెడ్డి, లింగోజిగూడ - ఎం శ్రీనివాసరావు, కొత్త పేట - జీవీ సాగర్ రెడ్డి, గడ్డి అన్నారం - ప్రవీణ్, మైలార్ దేవ్ పల్లి - టి శ్రీశైల్ రెడ్డి, బీఎన్ రెడ్డి నగర్ - లక్ష్మీ ప్రసన్న గౌడ్, బాగ్ అంబర్ పేట - పద్మావతి, బేగంపేట - తరుణి, హఫీజ్ పేట - వీ పూజిత, మెహిదీపట్నం - అశోక్, అహ్మద్ నగర్ - అస్మత్ ఉన్నీస, రెడ్ హిల్స్ - ఎం సరిత, మల్లేపల్లి - కే సంతోషి, అత్తాపూర్ - రావుల విజయ, మల్కాజ్ గిరి - ఎస్ జగదీష్ గౌడ్, మెట్టుగూడ - పీఎస్ భార్గవి, సీతాఫల్ మండి - సామల హేమ, జూబ్లీహిల్స్ - కాజా సూర్యనారాయణ, బార్కస్ - ఎస్ సరిత, లలితాబాగ్ - రాఘవేంద్రరాజు, కాంచన్ బాగ్ - ఎల్లం అంజమ్మ, ఫతేనగర్ - పీ సతీష్ గౌడ్, కార్వాన్- చిన్న నరేందర్, గోల్కొండ - అర్షియా ఖాన్, నాసల్ నగర్ - ఎస్ కే అబ్దల్ అజీమ్, టోలీచౌకి - సులక్షణలకు టికెట్లు కేటాయించినట్టు టీఆర్ఎస్ వెల్లడించింది. వీరితో పాటు హిమాయత్ నగర్ - ఇందిరా ప్రభాకర్ రెడ్డి, గాజుల రామారం - ఆర్ శేషగిరి, రంగారెడ్డి నగర్ - విజయశఖర్ గౌడ్, చింతల్ - రషీదా బేగం, సుభాష్ నగర్ - డీ శాంతి, సురారం - ఎం సత్యనారాయణ, హయత్ నగర్ - సామ తిరుమల రెడ్డి, దత్తాత్రేయనగర్ - అఖిల్ అహ్మద్, ఆల్విన్ కాలనీ - వెంకటేష్ గౌడ్, కూకట్ పల్లి - జూపల్లి సత్యనారాయణరావు, ఓల్డ్ బోయిన్ పల్లి - నర్సింహ యాదవ్, హైదర్ నగర్ - జానకి రామరాజు, మియాపూర్ - మేక రమష్, మూసాపేట - తూము శ్రావణ్ కుమార్ తదితరులు టీఆర్ఎస్ టికెట్లను దక్కించుకున్న వారిలో ఉన్నారు. కాగా, మరో 22 స్థానాలకు టీఆర్ఎస్ అభ్యర్థులు ఇంకా ఖరారు కాలేదు. ఈ స్థానాల్లో తమకు బీ-ఫారాలు దక్కుతాయని భావిస్తున్న ఆశావహులు నామినేషన్లు వేస్తున్నారు.