: ఆదిలోనే నిష్క్రమించిన సెంచరీల హీరో రోహిత్ శర్మ!
ఆస్ట్రేలియాతో మెల్ బోర్న్ లో జరుగుతున్న మూడవ వన్డేలో సెంచరీల హీరో రోహిత్ శర్మ ఆదిలోనే పెవీలియన్ దారి పట్టాడు. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా, ఫీల్డింగ్ ను ఎంచుకోగా, కేన్ రిచర్డ్ సన్ వేసిన నాలుగో ఓవర్ నాలుగో బంతికి రోహిత్ కీపర్ వాడేకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. 11 బంతులను ఎదుర్కొన్న రోహిత్ 6 పరుగులు మాత్రమే చేశాడు. ఇక రోహిత్ అవుట్ తరువాత బ్యాటింగ్ కు వచ్చిన కోహ్లీ, ఓపెనర్ శిఖర్ ధావన్ లు ఇన్నింగ్స్ కొనసాగించే బాధ్యతలను భుజాన వేసుకున్నారు. ధావన్ 8 పరుగులతో క్రీజులో ఉన్నాడు. ప్రస్తుతం భారత స్కోరు 5 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 16 పరుగులు.