: ప్రకృతి అవసరాలనూ తీర్చుకోలేకపోతున్న రైలు డ్రైవర్లు... హక్కుల కమిషన్ ముందుకు గోడు!


దేశంలో నిత్యమూ 19 వేల రైళ్లు అటు ప్రజల అవసరాలను, ఇటు రవాణా అవసరాలనూ తీరుస్తుండగా, వీటిని నడిపేందుకు 69 వేల మంది డ్రైవర్లున్నారు. వీరంతా కనీసం 12 గంటల పాటు రైలును నడిపే బాధ్యతలు నిర్విరామంగా నిర్వర్తించాల్సి వుంటుంది. రైలు ఇంజన్ల వద్దే ఉండే వీరు కనీసం టాయిలెట్ అవసరాలను తీర్చుకునేందుకు కూడా సమయం ఉండటం లేదట. తమ ప్రకృతి అవసరాలను తీర్చేందుకు మార్గం లేకుండా పోతోందని, దీంతో కొన్నిసార్లు ఒత్తిడిలో కూరుకుపోతున్న కొందరు డ్రైవర్లు ప్రమాదాలకు కారణమవుతున్నారని, తక్షణం ఈ విషయాన్ని పరిశీలించాలని ఇండియన్ రైల్వే లోకో రన్నింగ్ మెన్స్ ఆర్లనైజేషన్ (ఐఆర్ఎల్ఆర్ఓ) మానవ హక్కుల కమిషన్ ను ఆశ్రయించింది. పాసింజర్, ఎక్స్ ప్రెస్, హైస్పీడ్, రవాణా రైళ్లలో కనీస బ్రేక్ కూడా ఉండటం లేదని ఐఆర్ఎల్ఆర్ఓ వాదిస్తుండగా, సమయపాలన, ప్రజలకు సౌకర్యాల నిమిత్తం డ్రైవర్లకు బ్రేక్ ఇవ్వలేకపోతున్నట్టు రైల్వే వర్గాలు వ్యాఖ్యానించడం గమనార్హం.

  • Loading...

More Telugu News