: టాస్ గెలిచిన ఆస్ట్రేలియా... భారత్ బ్యాటింగ్
ఐదు వన్డేల సిరీస్ లో తొలి రెండు మ్యాచ్ లనూ ఓడిపోయిన భారత జట్టు చావోరేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్ లో టాస్ ఓడిపోయింది. కొద్ది సేపటి క్రితం మెల్ బోర్న్ మైదానంలో టాస్ వేయగా, టాస్ గెలిచిన ఆస్ట్రేలియా జట్టు భారత్ ను బ్యాటింగ్ కు ఆహ్వానించింది. తొలి రెండు మ్యాచ్ లలో తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు 300కు పైగా స్కోర్ ను సాధించినప్పటికీ, ఓడిపోయిన సంగతి తెలిసిందే. భారత జట్టులో రోహిత్, కోహ్లీలు భారీ స్కోర్లతో విరుచుకుపడినా, జట్టు ఓడిపోగా, మరింత స్కోరును ప్రత్యర్థి ముందుంచాలని ధోనీ భావిస్తున్నాడు. మరికాసేపట్లో భారత బ్యాటింగ్ ప్రారంభం కానుంది.