: డైలాగులు పేలాయి... బాలయ్య అదుర్స్: పరిటాల సునీత
హిందుపురం ఎమ్మెల్యే, హీరో బాలకృష్ణ తాజా చిత్రం 'డిక్టేటర్' అద్భుతంగా ఉందని ఏపీ మంత్రి పరిటాల సునీత కితాబిచ్చారు. అనంతపురంలోని గౌరీ థియేటర్ తో తన కుటుంబ సభ్యులతో కలసి చిత్రాన్ని వీక్షించిన ఆమె, అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈ చిత్రం 100 రోజులు గ్యారంటీగా ఆడుతుందని, విజయోత్సవ వేడుకలు అనంతపురంలో జరపాలని సూచించారు. చిత్రంలో బాలయ్య అద్భుతంగా నటించారని, డైలాగులు పేలాయని, హీరోయిన్ బాగుందని అన్నారు. కుటుంబమంతా హాయిగా చూసేలా చిత్రం ఉందని తెలిపారు. సినిమా చూసినంతసేపూ సమయం తెలియలేదని అన్నారు. నమ్ముకున్న ప్రజలను మరువకూడదని చెప్పిన డైలాగ్ తనకెంతో నచ్చిందని అన్నారు.