: వైకాపా ఎంపీ మిధున్ రెడ్డికి 14 రోజుల రిమాండ్
రేణిగుంట విమానాశ్రయ అధికారిపై దాడి జరిపిన కేసులో గత రాత్రి పోలీసులు అరెస్ట్ చేసిన వైకాపా ఎంపీ మిధున్ రెడ్డికి శ్రీకాళహస్తి సెషన్స్ కోర్టు న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ ను విధించారు. గట్టి బందోబస్తు మధ్య తెల్లవారుఝామున చెన్నై నుంచి శ్రీకాళహస్తికి మిధున్ రెడ్డిని తీసుకువచ్చి పోలీసులు ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించారు. ఆపై న్యాయమూర్తి ఇంటికి తీసుకువెళ్లి హాజరు పరిచారు. న్యాయమూర్తి రిమాండ్ విధించారు. మరికాసేపట్లో ఆయన్ను జైలుకు తరలించనున్నారు. నేడు కోర్టులకు సెలవు కావడంతో, రేపు మాత్రమే బెయిల్ పిటిషన్ దాఖలుకు అవకాశముంది.