: మరో ఉగ్రదాడి... 26 మంది మృతి!


బుర్కినా ఫాసో రాజధాని ఓగాడోగులోని ఓ స్టార్ హోటల్ పై ఉగ్రవాదులు విరుచుకుపడి దాదాపు 26 మందిని కాల్చి చంపారు. నగరంలోని ఫోర్ స్టార్ హోటల్ స్ల్పెండిడ్ పై అత్యాధునిక ఆయుధాలతో దాడి చేసిన ఉగ్రవాదుల కాల్పులకు మరో 33 మంది తీవ్రంగా గాయపడ్డారు. దాదాపు 12 గంటల పాటు భద్రతాదళాలు, జీహాదిస్టుల మధ్య పోరు కొనసాగిందని, 126 మందిని క్షేమంగా కాపాడామని అధికారులు తెలిపారు. దాడికి పాల్పడిన వారిలో ఓ అరబ్ వ్యక్తి, మరో ఇద్దరు నల్లజాతి ఆఫ్రికన్లు ఉన్నారని వివరించారు. ఈ దాడులు జరిపింది తామేనని ఏక్యూఐఎం (అల్ కైదా ఇన్ ది ఇస్లామిక్ మగరేబ్) ప్రకటించుకుంది. ఉగ్రవాదులకు వ్యతిరేకంగా ఫ్రాన్స్ చేస్తున్న కుట్రలకు వ్యతిరేకంగా దాడి చేసినట్టు వెల్లడించింది. కాగా, దాడికి దిగిన ఉగ్రవాదుల సంఖ్యపై సరైన సమాచారం లేకపోవడంతో ఆ ప్రాంతాన్నంతా పోలీసు బలగాలు జల్లెడ పడుతున్నాయి.

  • Loading...

More Telugu News