: ఒబామా వెంట అనునిత్యమూ హనుమంతుని ప్రతిమ


అమెరికా అధ్యక్షుడు ఒబామా ఎక్కడికి వెళ్లినా, ఏం చేసినా ఆయన జేబులో నిత్యమూ ఉండేవి ఏంటి? ఈ ప్రశ్నకు సమాధానం యూట్యూబ్ కోసం నిర్వహించిన ఓ ఇంటర్వ్యూలో వెల్లడైంది. యూట్యూబ్ క్రియేటర్ నీల్సన్ ఈ ఇంటర్వ్యూ చేస్తూ, మీ జేబులో ఏమున్నాయని ప్రశ్నించారు. ఆ వెంటనే తన జేబులో ఉన్న వస్తువులను ఒబామా బయటకు తీశారు. వీటిల్లో హనుమంతుని చిన్న ప్రతిమ, వాషింగ్టన్ పోప్ తనకిచ్చిన శిలువమాలతో పాటు బుద్ధుని విగ్రహం, వెండి పోకర్ గేమ్ చిప్ తదితరాలు ఉన్నాయి. తాను ఎక్కడికి వెళ్లినా వీటిని వెంట తీసుకువెళ్తానని ఈ సందర్భంగా ఒబామా వ్యాఖ్యానించారు. తాను నిరుత్సాహపడ్డప్పుడు, అలసిపోయిన వేళ హనుమంతుడిని ఆరాధిస్తానని తెలిపారు. తానేమీ భావోద్వేగాలకు అతీతుడిని కాదని అవసరమైన వేళ, తనకూ సాంత్వన అవసరమని వ్యాఖ్యానించారు. కొన్నిసార్లు నిరుత్సాహంలో కూరుకుపోతానని, ఆ సమయంలో తన జేబులో ఉండే వస్తువులను బయటకు తీసి ధ్యానంలో కాసేపు ఉంటానని తెలిపారు. కాగా, ఓ కెన్యా వాసి, కన్సాస్ కు చెందిన మహిళకు జన్మించిన ఒబామా, తన చిన్న తనంలో హిందూ మతస్థులు అధికంగా కనిపించే ఇండోనేషియాలో కొంతకాలం గడిపిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News