: అర్ధరాత్రి వైకాపా నేతల ఇళ్లపై పోలీసుల దాడులు... ఆరుగురు ఎమ్మెల్యేల నిర్బంధం!
సంక్రాంతి పండగను వైభవంగా ముగించుకుని సేదదీరుతున్న వేళ, చిత్తూరు జిల్లాలో వైకాపా నేతల ఇళ్లపై అర్ధరాత్రి పోలీసులు దాడులు చేశారు. ఆరుగురు ఎమ్మెల్యేలను గృహ నిర్బంధం చేశారు. జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్, 30 యాక్ట్ ను విధిస్తున్నట్టు ఈ ఉదయం పోలీసు అధికారులు ప్రకటించారు. ఆమధ్య రేణిగుంట విమానాశ్రయంలో మేనేజరుపై దాడి చేసిన కేసులో వైకాపా ఎంపీ మిధున్ రెడ్డిని చిత్తూరు పోలీసులు చెన్నైలో అరెస్ట్ చేశారు. ఆయనను శ్రీకాళహస్తి పోలీసు స్టేషన్ కు తరలించి విచారిస్తున్నారు. ఆదివారం నాడు వైకాపా శ్రేణులు ఉద్యమించవచ్చన్న ఆలోచనతో ముందు జాగ్రత్తగా ఎమ్మెల్యేలను, ముఖ్య నేతలను హౌస్ అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది.