: నేను జల్లికట్టుకి వ్యతిరేకిని కాదు: హీరో ధనుష్


తమిళనాడు సంప్రదాయ క్రీడ జల్లికట్టుకు తాను వ్యతిరేకి అంటూ వచ్చిన వార్తలపై తమిళ సినీ నటుడు ధనుష్ స్పందించాడు. ఈ మేరకు తన అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా ఓ సందేశం విడుదల చేశాడు. తాను జల్లికట్టుకి వ్యతిరేకిని కాదు అని స్పష్టం చేశాడు. తాను పెటా ప్రచారకర్తను కూడా కాదని ధనుష్ తెలిపాడు. అయితే తనకు పెటా సంస్థతో మంచి సంబంధాలు ఉన్నాయని చెప్పిన ధనుష్, జల్లికట్టు సంప్రదాయ క్రీడ అని, తాను దానికి వ్యతిరేకిని కాదని స్పష్టం చేశాడు. ఈ విషయంలో వచ్చిన వార్తలు అవాస్తవమని ధనుష్ తెలిపాడు. కాగా, జల్లికట్టుపై సుప్రీంకోర్టు నిషేధం విధించిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News