: తండ్రి ఉత్తరాన్ని చదివి భావోద్వేగానికి గురైన దీపిక!


ఫిల్మ్ ఫేర్ అవార్డుల కార్యక్రమంలో బాలీవుడ్ ప్రముఖ నటి దీపికా పదుకునే ఆహూతులను కంటతడిపెట్టించింది. ముంబైలో ఘనంగా జరిగిన ఫిల్మ్ ఫేర్ అవార్డుల కార్యక్రమంలో 'పీకూ'లో ప్రదర్శనకుగాను దీపికా పదుకునే ఉత్తమ నటిగా ఎంపికైంది. అవార్డు తీసుకునే సమయంలో దీపికా పదుకునే తన తండ్రి చాన్నాళ్ల క్రితం తనకు రాసిన లేఖను చదివి వినిపించింది. 'నువ్వు చేస్తున్న పనిని నువ్వు నిజంగా ప్రేమిస్తున్నట్టయితే, యాక నీకు మరే విషయమూ పెద్దది అనిపించదు. అది అవార్డులైనా లేక ఇంకేదైనా సరే, నీ మనసు ఏది చెబితే అది విను. నీ కలను నువ్వు నిజం చేసుకో, నువ్వు ముందు మా కుమార్తెవి, ఆ తరువాతే నటివి' అంటూ రాసిన ఆ లెటర్ ను చదివి భావోద్వేగానికి లోనయ్యారు. దీంతో అక్కడున్నవారు కూడా తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు.

  • Loading...

More Telugu News