: రేపటి మ్యాచ్ ఇక 'డిసైడ్' చేసేస్తుంది!
రేపు ఉదయం మెల్ బోర్న్ వేదికగా జరగనున్న మూడో వన్డే మ్యాచ్ ఈ సిరీస్ లో భారత్ కు ఫైనల్ తో సమానం అని విశ్లేషకులు పేర్కొంటున్నారు. పెర్త్, బ్రిస్బేన్ వేదికగా జరిగిన రెండు వన్డేల్లో 309, 308 పరుగుల చొప్పున చేసినప్పటికీ ఆ స్కోరును కాపాడుకోలేకపోవడం టీమిండియా ఆటగాళ్లలో కలవరం రేపుతోంది. టీమిండియా టాపార్డర్ కంటే మెరుగ్గా ఆసీస్ టాపార్డర్ ఆడడం భారత్ ను కలవరపెడుతోంది. ఆసీస్ టాపార్డర్ పై టీమిండియా బౌలర్లు ఎలాంటి ప్రభావం చూపలేకపోవడం ఆటగాళ్లను ఒత్తిడిలోకి నెడుతోంది. టీమిండియా ప్రధాన బౌలర్లు భువనేశ్వర్ కుమార్, ఇషాంత్ శర్మ, ఉమేష్ యాదవ్ ఎలాంటి ప్రభావం చూపలేకపోవడంతో ఈ పరిస్థితి తలెత్తింది. ఈ నేపథ్యంలో ఎలాగైనా మూడో వన్డేలో విజయం సాధించి సిరీస్ పై అభిమానుల్లో ఆసక్తి రేపాలని భారత జట్టు భావిస్తుండగా, ఈ మ్యాచ్ లో విజయం సాధించి సిరీస్ ను గెలుచుకోవాలని ఆసీస్ భావిస్తోంది.