: ఇకపై క్రియాశీలక రాజకీయాల్లో ఉంటా: జయసుధ


ఇకపై క్రియాశీలక రాజకీయాల్లో ఉంటానని తాజాగా టీడీపీలో చేరిన సినీ నటి జయసుధ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సమక్షంలో టీడీపీలో చేరిన అనంతరం ఆమె మాట్లాడుతూ, తెలుగు మాట్లాడే ప్రతి ఒక్కరికీ తానేంటో తెలుసని అన్నారు. ఇక బంధుత్వం పరంగా చూస్తే ఆంధ్రప్రదేశ్ తోనే తన అనుబంధం ఎక్కువని ఆమె చెప్పారు. ప్రజలకు సేవచేయాలనే లక్ష్యంతోనే తాను పార్టీ మారానని ఆమె అన్నారు. ఇకపై చంద్రబాబు ఎలా దారి చూపిస్తే ఆ దారిలో నడుస్తానని ఆమె చెప్పారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీడీపీ విజయం సాధిస్తుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News