: బోస్ మరణంపై రష్యన్ కోణంలో దర్యాప్తు జరగాలి: దీదీ డిమాండ్


అజాద్ హింద్ ఫౌజ్ వ్యవస్థాపకుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ మృతిపై రష్యన్ కోణంలో దర్యాప్తు జరపాలని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ డిమాండ్ చేశారు. కోల్ కతాలో జరిగిన నేతాజీ 75వ వార్షికోత్సవ సదస్సులో ఆమె మాట్లాడుతూ, నేతాజీ మృతిని నిర్ధారించలేకపోవడం దేశానికి సిగ్గుచేటని అన్నారు. స్వాతంత్ర్యం వచ్చిన తరువాత జాతిపిత మహాత్మాగాంధీ అయితే స్వాతంత్ర్యం రాకముందు నేతాజీ జాతినేత అని అన్నారు. విమాన ప్రమాదంలో నేతాజీ మృతిచెంది ఉంటే స్వాతంత్ర్యం అనంతరం ఆయన కుటుంబం రహస్యంగా జీవించాల్సి రావడానికి కారణం ఏంటని ఆమె అడిగారు. నేతాజీ కుటుంబంపై గూఢచారులు కన్నేసి ఉంచడానికి కారణమేంటని ఆమె ప్రశ్నించారు. వీటన్నింటికీ సమాధానాలు కావాలంటే రష్యన్ కోణంలో దర్యాప్తు జరగాలని ఆమె డిమాండ్ చేశారు. కాగా, నేతాజీ మృతికి సంబంధించిన వివరాలను నేతాజీ మనవడు ఆశిష్ రేకి చెందిన వెబ్ సైట్ వెల్లడిస్తూ ఆయన మృతి చెందారని పేర్కొన్న విషయం తెలిసిందే.

  • Loading...

More Telugu News