: చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరిన జయసుధ
హైదరాబాదు కాంగ్రెస్ నేత జయసుధ టీడీపీలో చేరారు. విజయవాడలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు సమక్షంలో జయసుధ ఆ పార్టీలో చేరారు. అంతకు ముందు ఆమె మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీకి తాను చాలాకాలం నుంచి దూరంగా ఉన్నానని అన్నారు. ఇకపై టీడీపీతో కలిసి పని చేస్తానని ఆమె పేర్కొన్నారు. 2009లో కాంగ్రెస్ పార్టీ తరపున సికింద్రాబాద్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన జయసుధ విజయం సాధించారు. 2014 ఎన్నికల్లో అదే స్థానం నుంచి పోటీ చేసినప్పటికీ ఆమె పరాజయం పాలయ్యారు. దీంతో ఆమె క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి చేదు అనుభవాలు ఎదురవుతున్న నేపథ్యంలో ఆమె టీడీపీలో చేరడం విశేషం.