: ఐఎస్ఐఎస్ ఖజానాపై బాంబుదాడి వీడియోను విడుదల చేసిన అమెరికా
ఐఎస్ఐఎస్ తీవ్రవాద సంస్థకు చెందిన ఖజానాపై బాంబుల వర్షం కురిపించిన అమెరికా రక్షణ శాఖ నేడు ఆ దృశ్యాలు విడుదల చేసింది. ఇటీవల ఐఎస్ఐఎస్ కు చెందిన నగదు డిపోపై యూఎస్ బాంబుల వర్షం కురిపించింది. దీంతో బాంబు పేలగానే డిపోలో ఉన్న నగదు గాల్లోకి లేచింది. ఈ సందర్భంగా డిపోలో ఉన్న నగదు ఏ దేశానికి చెందినది? ఎంత మొత్తం? అనే వివరాలు తెలియవని అమెరికా స్పష్టం చేసింది. అయితే నగదు మాత్రం మిలియన్లలో ఉంటుందని యూఎస్ రక్షణశాఖ తెలిపింది. తాము ఇంతటితో సరిపెట్టమని ఐఎస్ఐఎల్ కు చెందిన గ్యాస్, చమురు ఉత్పత్తి కేంద్రాలు, ఆర్థిక మౌలిక సదుపాయాలపై బాంబుదాడులు చేస్తామని అమెరికా రక్షణ శాఖ వెల్లడించింది. ఐఎస్ఐఎస్ కి ఐఎస్ఐఎల్ ఆర్థిక సాయం చేస్తోందని, ఉగ్రవాదులకు నగదు సాయం చేసేది కూడా ఈ సంస్థేనని, ఐఎస్ఐఎస్ లో రిక్రూట్ మెంట్స్ చేపట్టేది కూడా ఐఎస్ఐఎల్ అని వారు వివరించారు.