: టీ ట్వంటీలు తక్షణ సంతృప్తినిస్తాయి: సుస్మితా సేన్


టీ ట్వంటీలు తక్షణ సంతృప్తినిస్తాయని బాలీవుడ్ నటి సుస్మితాసేన్ తెలిపింది. తాజాగా క్రికెట్ ను మహిళలు కూడా అర్థం చేసుకుంటున్నారని సుస్మితా సేన్ వెల్లడించింది. యూఏఈలో వెటరన్ క్రికెటర్లతో నిర్వహించనున్న టోర్నీలో క్యాప్రికార్న్ కమాండర్స్ జట్టు తరపున సందడి చేసేందుకు వెళ్తున్న సుస్మితా సేన్ ఎయిర్ పోర్ట్ లో మీడియాతో మాట్లాడింది. ఐపీఎల్ తప్ప మరే ఫార్మాట్ క్రికెట్ ను తాను ప్రత్యక్షంగా వీక్షించలేదని చెప్పింది. టోర్నీ వీక్షించేందుకు భారీ ఎత్తున అభిమానులు వస్తారని, వారిలో మహిళలు కూడా పెద్దఎత్తున ఉండనున్నారని పేర్కొంది. టోర్నీలో భాగమయ్యేందుకు ఉత్సాహంగా ఎదురు చూస్తున్నానని సుస్మితా సేన్ తెలిపింది.

  • Loading...

More Telugu News