: గాంధీని స్మరిస్తారు...ఆయన సిద్ధాంతాలు మాత్రం పట్టించుకోరు: వెంకయ్య విస్మయం


ప్రస్తుత యువతరం తీరుపై కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు విస్మయం వ్యక్తం చేశారు. విశాఖపట్టణంలోని గీతం కళాశాలలో నిర్వహించిన గాంధీరామ అంతర్జాతీయ సదస్సులో ఆయన మాట్లాడుతూ, యువతరం గాంధీని స్మరించుకుంటారు కానీ ఆయన సిద్ధాంతాలను పట్టించుకోవడం లేదని విస్మయం వ్యక్తం చేశారు. అహింస, సత్యాగ్రహం సిద్ధాంతాలతో ప్రపంచాన్ని జయించవచ్చని ఆయన తెలిపారు. గ్రామాభివృద్ధితోనే దేశాభివృద్ధి సాధ్యమని గాంధీజీ నమ్మారని, అందుకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం గ్రామీణ భారతాన్ని అభివృద్ధి చేసేందుకు కంకణం కట్టుకుందని ఆయన చెప్పారు. ప్రధాని నరేంద్ర మోదీ లాహోర్ పర్యటనను ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయని, ఆయన పర్యటన గాంధీజీ సిద్ధాంతాల అమలులో ఓ భాగమేనని ఆయన స్పష్టం చేశారు. మోదీ పాక్ పర్యటన అంతర్జాతీయంగా ఆయనపై ఒత్తిడి పెంచేలా చేసిందని ఆయన అభిప్రాయపడ్డారు. స్వాతంత్ర్యోద్యమ సమయంలో గాంధీజీ కూడా అదే చేశారని ఆయన తెలిపారు.

  • Loading...

More Telugu News