: పాపం... మా నాన్న భోళా శంకరుడు: టీఆర్ఎస్ ఎంపీ కవిత


'పాపం...మా నాన్న సీఎం కేసీఆర్ భోళాశంకరుడు' అని టీఆర్ఎస్ ఎంపీ కవిత మరోసారి పేర్కొన్నారు. హైదరాబాదులో ఆమె మాట్లాడుతూ, అడగనిదే అమ్మయినా అన్నం పెట్టదని, అయితే కేసీఆర్ మాత్రం అలా కాదని, అడగకుండా చాలా చేశారని, ఆయనను ఏమడిగినా చేస్తారని అన్నారు. సీఎం కేసీఆర్ వికలాంగులకు 3 శాతం అదనపు రిజర్వేషన్ కల్పిస్తారని ఆమె చెప్పారు. డబుల్ బెడ్రూం ఫ్లాట్స్ నిర్మాణంలో కూడా ఈ అదనపు రిజర్వేషన్ వర్తించేలా చర్యలు తీసుకుంటామని ఆమె చెప్పారు. వికలాంగుల సంక్షేమానికి తాము కట్టుబడి ఉన్నామని ఆమె తెలిపారు. కేసీఆర్ పెట్టిన ఏ పథకమైనా టీఆర్ఎస్ కు చెందిన గల్లీ లీడర్ నుంచి ఢిల్లీ లీడర్ వరకు చిటికెల మీద చెబుతామని, బీజేపీ నేతలు అలా చెప్పగలరా? అని ఆమె సవాలు విసిరారు. సమస్యలు ప్రతి చోటా ఉన్నాయని, వాటన్నింటినీ పరిష్కరిస్తున్నామని ఆమె వివరించారు. గ్రేటర్ లో అంతా టీఆర్ఎస్ కు మద్దతు పలకాలని ఆమె సూచించారు.

  • Loading...

More Telugu News