: గ్రేటర్ హైదరాబాదులో ఊపందుకున్న నామినేషన్ల ప్రక్రియ
గ్రేటర్ హైదరాబాదు మున్సిపల్ ఎన్నికల కోలాహలం ప్రారంభమైంది. నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కావడంతో ఆశావహుల్లో ఉత్సాహం ఉరకలెత్తుతోంది. ఆదివారంతో నామినేషన్ల గడవు పూర్తికానుండడంతో బాటు, నేడు మంచి ముహూర్తం కూడా కావడంతో వివిధ పార్టీలకు చెందిన అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసేందుకు ఆయా సర్కిల్ కార్యాలయాల ముందు సందడి చేశారు. నామినేషన్ల ప్రక్రియ సందర్భంగా ప్రత్యర్థులు ఎదురైనప్పుడు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. కాగా, జాంబాగ్ కార్పోరేటర్ స్థానానికి ముఖేష్ గౌడ్ కుమారుడు విక్రమ్ గౌడ్, బంజారాహిల్స్ కార్పొరేటర్ స్థానానికి కేకే కుమార్తె విజయలక్ష్మి, తార్నాక నుంచి మాజీ మేయర్ బండ కార్తీకరెడ్డి నామినేషన్లు దాఖలు చేశారు.