: విజయవాడ నుంచి అదనంగా 250 బస్సులు


సంక్రాంతి పండగకు స్వస్థలాలకు వెళ్లి తిరిగి పట్టణాలకు చేరుకునే ప్రయాణికుల కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సు సర్వీసులు నడపనుంది. విజయవాడలోని పండిట్ జవహర్ లాల్ నెహ్రూ బస్ స్టాండ్ నుంచి హైదరాబాదు, చెన్నయ్, బెంగళూరు, ఉత్తరాంధ్ర, రాయలసీమలోని వివిధ ప్రాంతాలకు తిరుగుతున్న 246 బస్సులకు అదనంగా మరో 250 బస్సులను నడపనున్నట్టు విజయవాడ ఆర్టీసీ జోన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వెంకటేశ్వరరావు తెలిపారు. ఈ ప్రత్యేక సర్వీసులన్నీ రాత్రి 8 గంటల తరువాత మాత్రమే ప్రారంభమవుతాయని ఆయన చెప్పారు. ఈ బస్సులన్నింటికీ ఆన్ లైన్ బుకింగ్ సౌకర్యం ఉందని ఆయన వెల్లడించారు. ఈ బస్సుల్లో 50 శాతం అదనపు ఛార్జీ వసూలు చేస్తామని ఆయన ప్రకటించారు. ప్రజలు ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని ఆయన సూచించారు.

  • Loading...

More Telugu News