: 'రాంగ్' కాల్ తో దొరికిపోయిన స్మగ్లర్లు!


ఓ ఫోన్ కాల్ స్మగ్లర్ కొంపముంచింది. చిత్తూరు జిల్లా నిమ్మనపల్లె మండలం అగ్రహారం గ్రామంలో కొందరు స్మగ్లర్లు ఎర్రచందనం దుంగలను దాచి ఉంచారు. సంక్రాంతి విధుల్లో పోలీసులు బిజీగా ఉంటారని భావించిన స్మగ్లర్లు సందట్లో సడేమియాలా పండగ సీజన్ లోనే ఆ దుంగలను అమ్మేయాలని భావించారు. దీంతో ఎర్రచందనం వ్యాపారులందరికీ ఫోన్ లు చేసి అమ్మకానికి సిద్ధంగా ఉన్న దుంగల గురించి చెప్పారు. అయితే, ఈ కాల్స్ చేయడంలో పొరబాటు దొర్లడం వల్ల ఓ ఫోన్ కాల్ సరాసరి పోలీసులకు వెళ్లింది. దీంతో వారు ప్లాన్డ్ గా అగ్రహారం గ్రామం చేరుకుని ఎర్రచందనం దుంగల్ని దాచి ఉంచిన ప్రాంతాలపై దాడులు చేసి, టన్ను బరువున్న దుంగలను స్వాధీనం చేసుకుని, ముగ్గురు స్మగ్లర్లని అరెస్ట్ చేశారు.

  • Loading...

More Telugu News