: కాంగ్రెస్ పార్టీకి సినీ నటి జయసుధ గుడ్ బై!


కాంగ్రెస్ పార్టీకి గ్రేటర్ లో దెబ్బతగలనుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సికింద్రాబాద్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి విజయం సాధించిన జయసుధ విభజన అనంతరం జరిగిన ఎన్నికల్లో ఓటమిపాలైన సంగతి తెలిసిందే. ఈ మధ్య కాలంలో కాంగ్రెస్ క్రియాశీలక రాజకీయాల్లో కనిపించని ఆమె, తాజాగా పార్టీ వీడనున్నట్టు తెలుస్తోంది. గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో ఆమె కాంగ్రెస్ పార్టీని వీడి టీడీపీలో చేరనున్నట్టు సమాచారం. ఈ క్రమంలో ఈ సాయంకాలం ఆమె విజయవాడలో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుతో భేటీ కానున్నట్టు సమాచారం.

  • Loading...

More Telugu News