: కోడి పందాల్లో మనుషుల పోట్లాట.. కృష్ణా జిల్లాలో ఉద్రిక్తత


సంక్రాంతి సంబరాల్లో భాగంగా మూడు రోజులుగా జరుగుతున్న కోడి పందాల్లో కొద్దిసేపటి క్రితం మనుషులు పోట్లాడుకున్నారు. రెండు వర్గాలుగా విడిపోయి కోళ్ల మాదిరే కొట్లాడుకున్నారు. వెరసి కృష్ణా జిల్లా అగిరిపల్లి మండలం కృష్ణవరంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కోడి పందాల్లో భాగంగా రేగిన చిన్న వివాదం ఈ ఉద్రిక్తతకు దారి తీసినట్లు సమాచారం. రెండు వర్గాలుగా విడిపోయిన కొందరు వ్యక్తులు పరస్పర దాడులు చేసుకున్నారు. ఈ దాడుల్లో 12 మందికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో రంగప్రవేశం చేసిన పోలీసులు గాయపడ్డవారిని ఆసుపత్రికి తరలించి, దాడికి దారి తీసిన కారణాలపై ఆరా తీస్తున్నారు.

  • Loading...

More Telugu News