: చిక్కుల్లో ఆప్ మహిళా ఎమ్మెల్యే... ఆఫీసర్ పై దాడి చేసిన ఆమె భర్త అరెస్ట్


దేశ రాజకీయాల్లో రికార్డు విజయాలు నమోదు చేసిన ‘చీపురు’ పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీకి వరసగా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఆ పార్టీ మహిళా నేత, ఆర్కే పురం ఎమ్మెల్యే పరిమళ తోకాస్ చిక్కుల్లో పడ్డారు. విధి నిర్వహణలో ఉన్న ప్రభుత్వాధికారిపై నోరు పారేసుకోవడమే కాక ప్రత్యక్షంగా దాడికి దిగిన ఆమె భర్త ధీరజ్ ను నిన్న ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. నగరంలోని ఓ మురికివాడలో వివాదంగా మారిన గుడిసెలను తొలగించేందుకు వచ్చిన సీపీడబ్ల్యూడీ అధికారిని ధీరజ్ అడ్డుకున్నారు. ఈ సందర్భంగా జరిగిన వాగ్వాదంలో ధీరజ్ అధికారిపై నోరు పారేసుకున్నారు. అనంతరం కొందరు మహిళలను అధికారిపైకి ఉసిగొల్పారు. దీనిపై తీవ్ర మనస్తాపానికి గురైన అధికారి ధీరజ్ పై ఆర్కే పురం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై వెనువెంటనే ఎఫ్ఐఆర్ ఫైల్ చేసిన పోలీసులు నిన్న సాయంత్రమే ధీరజ్ ను అరెెస్ట్ చేశారు. దీనిపై స్పందించేందుకు పరిమళ తోకాస్ అందుబాటులోకి రాలేదు.

  • Loading...

More Telugu News