: రెండుసార్లు ఉరిశిక్ష.. తరువాత జైలు జీవితం నుండి విముక్తి
బాబూ మోలా 2009 ఏప్రిల్ నుండి జైలు జీవితం అనుభవిస్తున్నాడు. చూపుసరిగా లేని ఇతనికి కోల్ కతాలోని బహదూర్ పుర్ ట్రయిల్ కోర్టు రెండుసార్లు ఉరిశిక్ష విధించింది. అయితే గత వారంలో కోల్ కతా హైకోర్టు ఇచ్చిన తీర్పుతో జైలు జీవితం నుండి విముక్తి లభించింది. ఇతనిపై 5 సంవత్సరాల బాలుడిని హత్య చేసాడనే ఆరోపణలున్నాయి. ఆ బాలుని నేత్రాలను తొలగించి తన కళ్ల స్థానంలో పెట్టుకోవాలని ప్రయత్నించాడని పోలీసులు అంటున్నారు. అందుకే బాలుడిని హత్య చేశాడని వారు ఆరోపిస్తున్నారు. దీనిపై బాబూ మోలా కోల్ కతా హైకోర్టులో అప్పీలు చేసుకున్నాడు. దీనికి సంబంధించి ఎటువంటి సాక్ష్యాధారాలు లభ్యంకాకపోవడంతో హైకోర్టు కింది కోర్టు తీర్పును కొట్టివేస్తూ మోలాకు విముక్తి కల్పించింది. మోలా గతంలో ఇదే కేసులో ఇటువంటి పరిస్థితినే ఎదుర్కొన్నాడు.