: పఠాన్ కోట్ దర్యాప్తునకు అమెరికా సాయం కోరనున్న భారత్
పఠాన్ కోట్ ఎయిర్ బేస్ పై దాడులకు దిగిన ఆరుగురు ఉగ్రవాదులు అమెరికాలో తయారైన దుర్భిణీలను (బైనాక్యులర్) వినియోగించారు. దీనిని అమెరికా సైన్యం కూడా గుర్తించింది. జైషే ఎ మహ్మద్ ఈ దుర్భిణీలను ఆఫ్ఘనిస్తాన్ లో అమెరికా సైన్యం క్యాంపు నుండి దొంగిలించి ఉంటుందని అనుమానిస్తున్నారు. లేదా పాకిస్తాన్ అయినా వారికి అందజేసి ఉండవచ్చని తెలుస్తోంది. దీంతో ఎన్ఐఎ ఈ దుర్భిణీలపై ఉన్న నెంబర్ల ఆధారంగా అమెరికాకు సమాచారం అందిస్తూ దర్యాప్తునకు సాయం చేయాలని కోరింది. కాగా, ఉగ్రవాదుల నుండి లభ్యమైన దుస్తులు, షూ మొదలైనవి పాకిస్తాన్లోనే తయారయ్యాయని స్పష్టమైంది.