: గ్రేటర్ హైదరాబాదు బరిలో టీఆర్ఎస్ అభ్యర్థులు వీరే
గ్రేటర్ హైదరాబాదు మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి తరపున పోటీ చేయనున్న అభ్యర్థుల వివరాలను ఆ పార్టీ సీనియర్ నేత కేకే వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గ్రేటర్ లో టీఆర్ఎస్ చేసిన సర్వేల్లో వెల్లడైన అభిప్రాయాలను ప్రామాణికంగా తీసుకుని అభ్యర్థులను ఎంపిక చేశామని అన్నారు. తొలి జాబితాలో 60 మంది అభ్యర్థులను ప్రకటిస్తున్నామని చెప్పిన ఆయన, జాబితాలో 24 మంది బీసీలు, 16 మంది మైనార్టీలు, ఐదుగురు ఎస్సీ అభ్యర్థులు ఉన్నట్టు చెప్పారు. గ్రేటర్ ఎన్నికల్లో మహిళలకు పెద్దపీట వేస్తామని, 50 శాతం సీట్లను మహిళలకే కేటాయిస్తామని ఆయన చెప్పారు. గ్రేటర్ ఎన్నికల్లో 100 సీట్లలో విజయం సాధిస్తామని చెబుతున్న టీఆర్ఎస్, తొలి జాబితాలో పాతబస్తీపై దృష్టిసారించింది. టీఆర్ఎస్ తొలి జాబితాలో అభ్యర్థుల వివరాలు... *మీర్ పేట్ - అంజయ్య *హబ్సిగూడ - స్వప్నా సుభాష్ రెడ్డి *సైదాబాద్ - సింగిరెడ్డి స్వర్ణలతారెడ్డి *గుడిమల్కాపూర్ - బంగారు ప్రకాష్ *సోమాజిగూడ - విజయలక్ష్మీ *కాచిగూడ - చైతన్య కన్నాయాదవ్ *గచ్చిబౌలి - సాయిబాబా *గాంధీనగర్ - పద్మా నరేష్ *ముషీరాబాద్ - భాగ్యలక్ష్మీ యాదవ్ *శేరిలింగంపల్లి - నాగేంద్ర యాదవ్ *జీడిమెట్ల - పద్మాప్రతాప్ గౌడ్ *అల్వాల్ - విజయశాంతి రెడ్డి *గోల్నాక - జయశ్రీ *కొండాపూర్ - హమీద్ పటేల్ *మన్సురా బాద్ - కె.విఠల్ రెడ్డి *చైతన్యపురి - జి.విఠల్ రెడ్డి *బోలక్ పూర్ - రామారావు *బన్సీలాల్ పేట - హేమలత *అమీర్ పేట్ - శేషుకుమారి *సనత్ నగర్ - లక్ష్మీ బాల్ రెడ్డి *రాంగోపాల్ పేట - అరుణాగౌడ్ *బాలానగర్ - నరేంద్రాచారి *కేపీహెచ్‌బీ కాలనీ - అడుసుమిల్లి వెంకటేశ్వరరావు *తార్నాక - సరస్వతి హరి *బౌద్ధనగర్ - ధనుంజయదయనంద్ గౌడ్ *అడ్డగుట్ట - విజయకుమారి *జియాగూడ - కృష్ణ *ఎర్రగడ్డ - అన్నపూర్ణ యాదవ్ *కాప్రా - స్వర్ణరాజు శివమణి *ఎఎస్ రావునగర్ - పావనిరెడ్డి *యూసఫ్ గూడ - బి.సంజయ్ గౌడ్ *బోరబండ - బాబా షంషుద్దీన్ *రహ్మత్ నగర్ - మహ్మద్ అబ్దుల్ షఫీ *ఉప్పల్ - హన్మంతరెడ్డి *అల్లాహ్ పూర్ - సబిహా బేగం *అజంపుర - సిద్దా లక్ష్మీ *ఓల్డ్ మలక్ పేట్ - భువనేశ్వరి *ముసారాంబాగ్ - తీగల సునీతారెడ్డి *ఛాన్వీ - ఖలీం *ఉప్పుగూడ - శీనయ్య *జంగంపేట్ - సీతారాం రెడ్డి *గన్సీబజార్ - మహాదేవి *కుర్మాగూడ - పూజఅఖిల్ యాదవ్ *డబీర్ పూరా - మహ్మద్ అబ్దుల్ జీషాన్ *రియసత్ నగర్ - మహ్మద్ యూసఫ్ *సంతోష్ నగర్ - మహ్మద్ అక్రముద్దీన్ *రెయిన్ బజార్ - మహ్మద్ అయజ్ *మోండా మార్కెట్ - ఆకుల రూపహరికృష్ణ *శాలిబండ - అన్వర్ *మొఘల్ పూరా - వీరామణి *పత్తర్ ఘట్ - మిర్జాబేకీర్ అలీ *పురాణా పుల్ - మల్లికార్జున్ యాదవ్ *చాంద్రయణగుట్ట - రాజేంద్రకుమార్ *తలబ్ చంచలం - ఫాతిమా *గౌలిపురా - మీనా *ఐఎస్ సదన్ - స్వప్నాసుందర్ రెడ్డి *కిషన్ బాగ్ - షకీల్ అహ్మద్ *రమ్నసపురా - అజమ్ పాషా *నవాబ్ షాహెబ్ కుంట - ఫర్హత్ సుల్తానా *జాహునుమా - గులాంనబీ