: అఖిల్, చైతన్యలలో 'బంగార్రాజు' అలా కనిపిస్తాడు!: నాగార్జున
అఖిల్ వాళ్లమ్మ ముందు రామూలా ఉంటాడని నాగార్జున చెప్పారు. 'సోగ్గాడే చిన్న నాయన' సినిమా ప్రమోషన్ లో నాగార్జున, నాగచైతన్య, అఖిల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ, అలాగని వాడు రామూ కాదని, బయటికెళ్లాక బంగార్రాజేనని నవ్వుతూ అన్నారు. నాగచైతన్య విషయానికి వస్తే, వాడు మనసులో బంగార్రాజు కానీ, బయటకి మాత్రం రామూలా కనిపించేందుకు కష్టపడుతుంటాడని నాగార్జున చెప్పారు. వాళ్లు బయట ఎలా ఉన్నా తన ముందు మాత్రం రామూలా కనిపిస్తే చాలని నాగార్జున చెప్పారు. దీనికి అఖిల్, నాగచైతన్య తలవంచుకుని తెగ నవ్వుకున్నారు.