: అనంతపురంలో మంజుల ఆత్మ'హత్య' కేసులో వెలుగు చూసిన కొత్తకోణం!


అనంతపురం జిల్లా శ్రీనివాసనగర్ లో మంజుల అనే యువతి ఆత్మహత్య కేసు పలు మలుపులు తిరుగుతోంది. ఈ కేసులోతుల్లోకి వెళ్లే కొద్దీ దారుణాలు వెలుగు చూస్తున్నాయి. ఈ కేసును ఆత్మహత్యగా చిత్రీకరించేదుకు పెద్దతలకాయలు ప్రయత్నిస్తున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కాగా, ఈ కేసు పూర్వాపరాల్లోకి వెళ్తే...మంజులను పుట్టపర్తి మండలం బత్తలపల్లికి చెందిన మహిళగా పోలీసులు గుర్తించారు. వడ్డె మారన్న కుమార్తె మంజుల తమ గ్రామానికి చెందిన రాము (వెంకటరమణ చౌదరి)ని ప్రేమించింది. దీంతో రాము ఆమెను తీసుకుని వెళ్లిపోయాడు. గ్రామం నుంచి ఎవరికీ చెప్పకుండా వచ్చేసిన రాము, మంజులకు అనంతపురం ఆర్టీసీ కాంప్లెక్స్, రైల్వే స్టేషన్ లో క్యాంటీన్ లు నిర్వహించే శ్రీనివాస్ చౌదరి ఆశ్రయం కల్పించాడు. ఇదిలా ఉంచితే, కూతురు మంజుల రాముతో వెళ్లిపోవడంతో ఆమె తండ్రి ఆమెతో బంధాన్ని తెంచుకున్నాడు. ఈ క్రమంలో మంజులపై కన్నేసిన శ్రీనివాస్ చౌదరి, రామూను ఒప్పించి మంజులను బలవంతంగా వివాహం చేసుకున్నాడు. దీంతో తప్పని పరిస్థితుల్లో ఆమె ఇద్దరితోనూ గడిపింది. ఈ సన్నివేశాలను వీడియో తీసిన వారిద్దరూ ఆమెను బ్లాక్ మెయిల్ చేసి, ఆమెను అంగడి బొమ్మగా మార్చేశారు. అలా పలువురి వద్దకు పంపిన వారు, ఆమెను ఓ ఎమ్మెల్యే వద్దకు కూడా పంపారు. ఆయన తన ఇద్దరి స్నేహితుల వద్దకు కూడా ఆమెను పంపాడు. ఇద్దరు భర్తల ఆగడాలు శృతిమించడంతో వారితో ఆమె తీవ్రంగా గొడవపడుతోంది. ఈ క్రమంలో ఆమె సోమవారం రాత్రి ఆత్మహత్య చేసుకుందని శ్రీనివాస్ చౌదరి ఆమె మృతదేహాన్ని ఆసుపత్రి మార్చురీ వద్ద పడేసి పరారయ్యాడు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు, ఆమె తల్లిదండ్రుల గురించి తెలుసుకుని వివరాలు చెప్పగా, తన కుమార్తె భర్త శ్రీనివాస్ చౌదరి కాదని, రాము (వెంకటరమణ చౌదరి) అని చెప్పారు. దీంతో కూపీ లాగిన పోలీసులకు తీగలాగితే డొంక కదిలినట్టు తెలుస్తోంది. దీనిపై మరింత లోతుగా దర్యాప్తు చేసి, నిందితులను శిక్షించాలని వైఎస్సార్సీపీ నేతలు డీఎస్పీని కలిసి వినితి పత్రం సమర్పించారు.

  • Loading...

More Telugu News