: ఈ స్కోరు సరిపోదు...ఫీల్డింగ్ తప్పిదాలు కూడా కారణమే: ధోనీ


ఆస్ట్రేలియా గడ్డపై ఆస్ట్రేలియాను ఓడించాలంటే స్కోరు బోర్డుపై తాము ఉంచిన పరుగుల లక్ష్యం సరిపోదని టీమిండియా కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ అభిప్రాయపడ్డాడు. బ్రిస్బేన్ వేదికగా జరిగిన రెండో వన్డేలో టీమిండియా ఓడిన అనంతరం ధోనీ మాట్లాడుతూ, అద్భుతమైన ఫీల్డింగ్ చేసినా, కీలక సమయాల్లో ఫీల్డింగ్ లో క్యాచ్ లు జారవిడవడం ఆసీస్ కు అనుకూలంగా మారిందని తెలిపాడు. బౌలర్లు శక్తివంచన లేకుండా కట్టుదిట్టమైన బంతులు వేస్తున్నారని, ఆసీస్ బౌలర్లు కూడా అంతే స్కోరు చేశారన్న విషయాన్ని గుర్తించాలని కోరాడు. అయితే స్కోరు బోర్డుపై టీమిండియా పెడుతున్న పరుగులు సరిపోవని, మరింత మెరుగైన స్కోరు సాధించాలని ధోనీ స్పష్టం చేశాడు. మూడో వన్డేలో టీమిండియాకు విజయం కీలకమని ధోనీ తెలిపాడు.

  • Loading...

More Telugu News