: గ్రేటర్ హైదరాబాదు మున్సిపల్ కార్పొరేషన్లో విజయం మాదే!: కడియం


గ్రేటర్ హైదరాబాదు మున్సిపాలిటీకి జరగనున్న ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ విజయదుందుభి మోగిస్తుందని తెలంగాణ డిప్యూటీ ముఖ్యమంత్రి కడియం శ్రీహరి తెలిపారు. హైదరాబాదులో గ్రేటర్ ఎన్నికల్లో పోటీ చేయనున్న 60 మంది అభ్యర్థుల జాబితా ప్రకటించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గ్రేటర్ ప్రచారంలో టీఆర్ఎస్ దూసుకుపోతోందని అన్నారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ గ్రేటర్ లో కూడా అధికారం చేపడితే హైదరాబాదు విశ్వనగరంగా తయారవుతుందని ఆయన చెప్పారు. పలు సర్వేల్లో గ్రేటర్ పీఠాన్ని టీఆర్ఎస్ కైవసం చేసుకుంటుందని వెల్లడైందని ఆయన పేర్కొన్నారు. గ్రేటర్ హైదరాబాదు ఛైర్మన్ గా టీఆర్ఎస్ అభ్యర్థి విజయం సాధిస్తాడని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News