: రెండో వన్డే కూడా షరా మామూలే...మ్యాచ్ పోయింది, మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది


టీమిండియా మళ్లీ ఓటమిపాలైంది. పెర్త్ వేదికగా జరిగిన తొలి వన్డేలో భారత జట్టు ఎలా ఓడిందో, బ్రిస్బేన్ వేదికగా నేడు జరిగిన రెండో వన్డేలో కూడా అలాగే టీమిండియా ఓటమిపాలైంది. తొలుత బ్యాటింగ్ ప్రారంభించిన భారత జట్టులో మరోసారి రోహిత్ శర్మ సెంచరీతో ధాటిగా ఆడితే, విరాట్ కోహ్లీ అర్ధ సెంచరీతో ఆకట్టుకోగా, రహానే అద్భుతమైన ఆటతీరుతో టీమిండియా 308 పరుగులు చేసింది. భారత బ్యాట్స్ మన్ లో ధావన్, ధోనీ, మనీష్ పాండే, జడేజా, అశ్విన్ నిరాశపరిచారు. అనంతరం ధాటిగా బ్యాటింగ్ ప్రారంభించిన ఆరోన్ ఫించ్, షాన్ మార్ష్ చెరో 71 పరుగులు చేసి జట్టుకు శుభారంభం ఇవ్వగా స్టీవ్ స్మిత్ (46) ఆకట్టుకున్నాడు. అనంతరం జార్జ్ బెయిలీ (76), మ్యాక్స్ వెల్ (26) సమయోచితంగా ఆడడంతో ఆస్ట్రేలియా జట్టు ఏడు వికెట్ల తేడాతో భారత జట్టుపై విజయం సాధించింది. తాజా విజయంతో ఈ సిరీస్ లో టీమిండియాపై ఆసీస్ జట్టు 2-0 ఆధిక్యం సంపాదించుకుంది. టీమిండియా బౌలర్లలో ఇషాంత్ శర్మ, ఉమేష్ యాదవ్, రవీంద్ర జడేజా తలో వికెట్ తీశారు. కాగా, మ్యాచ్ లో 124 పరుగులు చేసిన రోహిత్ శర్మను మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ వరించింది.

  • Loading...

More Telugu News