: 60 డివిజన్లకు అభ్యర్థులను ప్రకటించిన టీఆర్ఎస్
గ్రేటర్ హైదరాబాదు మున్సిపాలిటీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ ఉత్సాహంగా పాల్గొంటోంది. గ్రేటర్ ప్రచారంలో ఇతర పార్టీల కంటే ముందున్న టీఆర్ఎస్ పార్టీ, ఈ ఎన్నికల్లో పోటీ చేయనున్న 60 మంది అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేసింది. గ్రేటర్ ఎన్నికల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్ కల్పిస్తున్నట్టు టీఆర్ఎస్ సీనియర్ నేత కేకే తెలిపారు. జాబితాను విడుదల చేసిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గ్రేటర్ లో 100కు పైగా సీట్లలో టీఆర్ఎస్ విజయం సాధిస్తుందని చెప్పారు. 24 మంది బీసీలు, 16 మంది మైనారిటీలు, ఐదుగురు ఎస్సీలకు తొలి జాబితాలో స్థానం కల్పించినట్టు ఆయన తెలిపారు.