: జనాలు లేక బోసిపోయిన హైదరాబాదు, వైజాగ్


నిత్యం రద్దీతో కళకళలాడే హైదరాబాదు, విశాఖపట్టణాలు జనాలు లేక బోసిపోయాయి. నిత్యం ఆఫీసులకు వెళ్లే జనాలతో రద్దీగా కనబడే కూడళ్లు సంక్రాంతిని పురస్కరించుకుని వెలవెలబోతున్నాయి. హైదరాబాదు, విశాఖపట్టణాల్లో వృత్తి, ప్రవృత్తి రీత్యా ఈ ప్రధాన నగరాల్లో విధులు నిర్వర్తించే స్థానికేతరులు స్వస్థలాలకు తరలిపోయారు. దీంతో గ్రేటర్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైనా హైదరాబాదులో సందడి కనపడడం లేదు. మరోవైపు వైజాగ్ లో నిత్యం రద్దీగా ఉండే ద్వారాకానగర్, బీచ్ రోడ్, సిరిపురం జక్షన్ లు జనసంచారం లేక వెలవెలబోయాయి. నిత్యం ట్రాఫిక్ రద్దీతో పలు జంక్షన్లలో భారీగా వాహనాలు నిలిచిపోయేవి. రద్దీ తగ్గడంతో ఈ రెండు పట్టణాల్లో ఎలాంటి ట్రాఫిక్ రద్దీ నెలకొనకపోవడం విశేషం.

  • Loading...

More Telugu News