: చిరంజీవి ఇంట్లో విడిది...మూడు రోజులు ఫుల్ ఎంజాయ్: కోదండరామిరెడ్డి


మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో విడిది చేశామని ప్రముఖ దర్శకుడు కోదండరామిరెడ్డి తెలిపారు. పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, సంక్రాంతి అంటే ఉభయగోదావరి జిల్లాల్లో ఉండే సందడే వేరని అన్నారు. ఇక్కడ ప్రతి ఊరిలోనూ పండగ శోభ కొట్టొచ్చినట్టు కనబడుతుందని ఆయన చెప్పారు. ప్రతి సంక్రాంతిని ఇక్కడే జరుపుకుంటామని చెప్పిన ఆయన, కోడి పందాలను చూసి ఆస్వాదిస్తానని అన్నారు. తనకు పేకాట వంటివి రావు కనుక వాటిల్లో పాల్గొనే అవకాశం లేదని, దూరం నుంచి చూసి ఆనందించడమేనని ఆయన తెలిపారు. ఉభయగోదావరి జిల్లాల్లో కొన్ని ఊర్లను నిన్నే చుట్టామని, ఈ రోజు కొన్నింటిని చూస్తున్నామని ఆయన చెప్పారు. చిరంజీవి ఇంట్లొో విందు తరువాత 'ఎక్స్ ప్రెస్ రాజా' సినిమా చూసేందుకు వెళ్తున్నామని ఆయన వివరించారు. మూడు రోజులు పూర్తిగా ఎంజాయ్ చేసి, ఏడాదికి సరిపడా అనుభూతులను గుండెల్లో నింపుకుని తిరిగి వెళ్లిపోవడమేనని ఆయన తెలిపారు.

  • Loading...

More Telugu News