: నా వందో సినిమాలో మోక్షజ్ఞ నటించొచ్చు... వారసుడి తెరంగేట్రంపై బాలయ్య ఫీలర్


టాలీవుడ్ అగ్ర నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తన నట వారసుడిగా తన కొడుకు మోక్షజ్ఞను బరిలోకి దింపేందుకు దాదాపుగా రంగం సిద్ధం చేసుకున్నట్టే కనిపిస్తోంది. సంక్రాంతి సంబరాల కోసం తన బావ నారా చంద్రబాబునాయుడి సొంతూరు నారావారిపల్లెకు వెళ్లిన బాలయ్య కొద్దిసేపటి క్రితం మీడియాతో మాట్లాడుతూ మోక్షజ్ఞ తెరంగేట్రంపై ఓ ఫీలర్ వదిలారు. తన 99వ చిత్రం ‘డిక్టేటర్’ విజయవంతంగా ప్రదర్శితమవుతున్న నేపథ్యంలో మైకులు ముందుపెట్టిన వెంటనే వాటి వద్దకు వచ్చిన బాలయ్య ఓ ఆసక్తికర ప్రకటన చేశారు. త్వరలోనే బాలయ్య వందో చిత్రం షూటింగ్ ప్రారంభం కానుంది. సదరు చిత్రంలో తన కొడుకు మోక్షజ్ఞ నటించే అవకాశాలు లేకపోలేదని బాలయ్య చెప్పారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడిస్తానని బాలయ్య పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News