: నాన్నకు మహిళలంటే అభిమానం...మహిళలూ ఆయనను ఆదరించారు: తండ్రి జ్ఞాపకాల్లో బాలయ్య
టాలీవుడ్ అగ్రనటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సంక్రాంతి పర్వదినాన తన తండ్రి నందమూరి తారకరామారావు జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. సంక్రాంతి సంబరాల కోసం చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలంలోని తన బావ నారా చంద్రబాబునాయుడు సొంతూరు నారావారిపల్లెకు వచ్చిన బాలయ్య కొద్దిసేపటి క్రితం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులు అడిగిన పలు ప్రశ్నలకు ఆయన సమాధానాలిస్తూ ఎన్టీఆర్ ను గుర్తు చేసుకున్నారు. తన తండ్రికి మహిళలంటే ప్రత్యేక అభిమానమని బాలయ్య పేర్కొన్నారు. సినిమాల్లో హీరోయిన్ పాత్రలకు మంచి ప్రాధాన్యత ఇవ్వడమే కాక మహిళల విద్య కోసం ఏకంగా తిరుపతిలో పద్మావతి మహిళా విశ్వవిద్యాలయాన్నే ఏర్పాటు చేశారని తెలిపారు. ఇక తన తండ్రి ఇచ్చిన ప్రాధాన్యానికి మహిళలు కూడా బాగానే స్పందించారని, ఎక్కడికెళ్లినా ఆయనకు బ్రహ్మరథం పట్టారని బాలయ్య చెప్పారు.