: ఎబోలాను నాశనం చేసేశాం.. ఇకపై భయపడాల్సిందేమీ లేదు: డబ్ల్యూహెచ్ఓ


ఆఫ్రికా దేశాలతో పాటు అగ్రరాజ్యం అమెరికాను వణికించిన ప్రాణాంతక వ్యాధి ఎబోలా గురించి ఇక భయపడాల్సిందేమీ లేదు. వ్యాధి సంక్రమించిన రోజుల వ్యవధిలోనే ప్రాణాలు హరించే ఈ వ్యాధి చికిత్స కోసం ఏకంగా ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేయాల్సి వచ్చింది. ఈ వ్యాధి సోకిన వారికి చికిత్స చేసే క్రమంలో ఈ మహమ్మారి బారిన పడిన వైద్యులు, నర్సులు కూడా మృత్యువాత పడ్డారు. అయితే ఈ వ్యాధి మూలాలతో పాటు వ్యాధి వ్యాప్తికి అవకాశం ఉన్న అన్ని కారకాలను కూడా సమూలంగా నాశనం చేశామని ఐక్యరాజ్యసమితి ఆరోగ్య విభాగం ప్రపంచ ఆరోగ్య సంస్థ నిన్న ప్రకటించింది. ఈ వ్యాధి గురించి ఇకపై భయపడాల్సిందేమీ లేదని ఆ సంస్థ భరోసా ఇచ్చింది.

  • Loading...

More Telugu News