: సంక్రాంతి సంబరాల్లో బాలీవుడ్ మిస్టర్ ఫర్ ఫెక్షనిస్ట్... పతంగులు ఎగరేసిన ఆమిర్


‘అసహనం’పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి చిక్కుల్లో పడ్డ బాలీవుడ్ మిస్టర్ ఫర్ ఫెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్ సంక్రాంతి సంబరాల్లో మునిగిపోయాడు. సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని అతడు నిన్న ముంబైలో పతంగులను ఎగురవేశాడు. చిన్న సైజు జుట్టుతో తెల్లటి లాల్చీ పైజామాలో తన అనుయాయులతో కలిసి పతంగులను ఎగురవేస్తున్న ఫొటోలను అతడు ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు. అంతేకాక దేశ ప్రజలకు అతడు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపాడు. ప్రస్తుతం ‘దంగల్’ చిత్రంలో నటిస్తున్న అతడు, సదరు చిత్రం కోసం చేయించుకున్న హెయిర్ కట్ లోనే సదరు ఫొటోల్లో దర్శనమిచ్చాడు.

  • Loading...

More Telugu News