: టైట్ జీన్స్ తో మగతనానికి ముప్పు... హెచ్చరిస్తున్న వైద్య నిపుణులు
ఫ్యాషన్ పేరుతో పురుషులు జీన్స్ ప్యాంట్లను ఎంత అమితంగా ఇష్టపడుతున్నారో అంతగా వారికి అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశముంది. ఈ జీన్స్ కల్చర్ పెరిగిపోవడం అనేది పురుషుల్లో నపుంసకత్వానికి దారితీసే అవకాశముందట. టైట్ గా ఉన్న జీన్స్ ప్యాంటన్లు ధరించడం వలన మగవారి వీర్యకణాల కౌంట్ గణనీయంగా తగ్గిపోతున్నదని వైద్య నిపుణులు తెలియజేస్తున్నారు. సాధారణంగా పురుషుల్లో ఫెర్టిలిటీ రేటు అంటే స్పెర్మ్ కౌంట్ 150 మిలియన్లు అంతకన్నా ఎక్కువగా ఉంటుంది. అయితే ఇది ప్రస్తుతం 140 మిలియన్లకు పడిపోయిందట.దీనికి ముఖ్య కారణం పురుషులు లైఫ్ స్టయిల్ ను మార్చుకోవడంతో పాటు విరివిగా జీన్స్ ప్యాంట్లను ధరించడమేనని ఒక అధ్యయనంలో వెల్లడైంది.