: మోదీ ప్రామిస్ కోసం ముఫ్తీ ఎదురుచూపు
ముఫ్తీ మహ్మద్ సయీద్ మరణానంతరం ఖాళీ అయిన జమ్ము, కాశ్మీర్ ముఖ్యమంత్రి సీటు విషయంలో ఇప్పటివరకూ ఎలాంటి నిర్దిష్టమైన ప్రకటనా వెలువడ లేదు. అయితే రాష్ట్రంలో ప్రజా మద్దతు ఉన్న పీడీపీ నేతలు బీజేపీ అధిష్ఠానం తమకు పొత్తు విషయంలో తగిన హామీలు ఇచ్చేవరకూ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగదని తేల్చి చెబుతున్నారు. అయితే, ఈ విషయంలో తమకు బీజేపీ నేత రామ్ మాధవ్ ఒక్కరే హామీ ఇస్తే సరిపోదని, దీనితోపాటు హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్, ప్రధాని నరేంద్ర మోదీ కూడా హామీ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఇరు పార్టీల పొత్తుపై ప్రధాని మోదీ స్పష్టమైన హామీ ఇచ్చిన తరువాతే మహబూబా ముఫ్తీ జమ్ము, కాశ్మీర్ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయనున్నట్లు తెలుస్తోంది.