: ఏపీలో కోడిపందాలు హైలైట్...తెలంగాణలో గాలిపటాల రెపరెపలు!


ఆంధ్రప్రదేశ్ లో ఏ మూలకెళ్లినా సందడి నెలకొంది. తెలుగు ప్రజలు ప్రతి ఏటా ఘనంగా నిర్వహించుకునే సంక్రాంతి సంబరాలు ఈ సంవత్సరం మరింత వైభవంగా జరుగుతున్నాయి. స్వస్థలాలకు చేరిన ప్రజలు పండగను ఘనంగా నిర్వహించుకుంటున్నారు. సంక్రాంతిని పురస్కరించుకుని పండగను ఘనంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతి జిల్లాకు కోటి రూపాయల చొప్పున నిధులు విడుదల చేయడంతో గ్రామగ్రామాన రాజకీయ నాయకులు స్థానికులతో కలసి సందడి చేశారు. తొలి రోజు భోగి పండగను పురస్కరించుకుని తెల్లవారుజామునే గ్రామాల్లో పెద్దపెద్ద మంటలను ఏర్పాటు చేయగా, పట్టణాల్లో కూడా మంటలు ఏర్పాటు చేశారు. పల్లెపల్లెనా స్త్రీలకు ముత్యాలముగ్గుల పోటీలు నిర్వహించారు. అలాగే పలు జిల్లాల్లో కోడిపందాలు, పొట్టేళ్ల పందాలు నిర్వహించారు. ఈ పందాల్లో భారీ ఎత్తున డబ్బులు చేతులు మారుతున్నట్టు తెలుస్తోంది. తెలంగాణలో గాలిపటాలు ఎగురుతున్నాయి. వివిధ కాలనీల్లో గాలిపటం ఎగురవేసే పోటీలు నిర్వహించి సంక్రాంతిపై ఆసక్తి పెంచారు.

  • Loading...

More Telugu News