: సీమాంధ్ర వ్యతిరేక వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పే ప్రసక్తేలేదు: కేటీఆర్
తెలంగాణ ఉద్యమ సమయంలో సీమాంధ్ర ప్రజలపై చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నామని ఆ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. హైదరాబాదులో ఓ టీవీ ఛానెల్ కు ఇంటర్వ్యూ ఇచ్చిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలంగాణ ఉద్యమ సమయంలో చేసిన వ్యాఖ్యలపై సీమాంధ్రులకు క్షమాపణ చెప్పే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. అప్పటి పరిస్థితులను బట్టి అప్పుడు మాట్లాడామని, ఇప్పటి పరిస్థితులను బట్టి ఇప్పుడు మాట్లాడుతున్నామని ఆయన తెలిపారు. గ్రేటర్ హైదరాబాదు మున్సిపాలిటీ ఎన్నికల్లో పరాజయం పాలైనంతమాత్రన టీఆర్ఎస్ పార్టీకి వచ్చిన నష్టం ఏమీ లేదని ఆయన పేర్కొన్నారు. ఏ ప్రాంతంలో ఎవరు గెలుస్తారని భావిస్తే వారికే సీట్లిస్తామని ఆయన చెప్పారు.