: నా గెటప్ మా ఆవిడకు బాగా నచ్చేసింది: జూనియర్ ఎన్టీఆర్


'నాన్నకు ప్రేమతో' సినిమాలో తన విభిన్నమైన లుక్ తన భార్యకు బాగా నచ్చిందని జూనియర్ ఎన్టీఆర్ తెలిపాడు. నాన్నకు ప్రేమతో ప్రమోషన్ లో మాట్లాడుతూ, తనకు ఈ సినిమా చాలా స్పెషల్ అని చెప్పాడు. అందుకు కారణం తనకు తన తండ్రిపై ఉన్న ప్రేమ, సినిమా కథ మీద ఉన్న నమ్మకం, సుకుమార్ పై నున్న నమ్మకం అని జూనియర్ ఎన్టీఆర్ వివరించాడు. అయితే ఈ సినిమా అనుకున్నప్పుడే అంతా ఫ్రెష్ గా విభిన్నంగా ఉండాలని భావించామని, అందుకే అన్నీ కొత్తగా ప్రయత్నించామని ఆయన చెప్పాడు. ఈ న్యూ లుక్ కూడా అలా వచ్చినదేనని ఆయన తెలిపాడు. ఈ లుక్ లో తొలిసారి తనను చూసినప్పుడు తన భార్యకు నచ్చానని, తన తల్లి మాత్రం కొంత భయపడ్డారని, ఇప్పుడు అభిమానులు ఆదరిస్తున్నారని ఆయన హర్షం వ్యక్తం చేశాడు.

  • Loading...

More Telugu News