: రెండో వన్డేపై గురిపెట్టిన ధోనీ సేన


బ్రిస్బేన్ వేదికగా గబ్బా స్టేడియంలో రేపు జరగనున్న రెండో వన్డేపై టీమిండియా గురిపెట్టింది. పెర్త్ వేదికగా జరిగిన తొలి వన్డేలో టీమిండియా ఓటమిపాలవ్వడంతో ఐదు వన్డేల సిరీస్ లో వెనకబడింది. బ్యాటింగ్ లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, ధోనీ రాణించి ఆశలు రేపినప్పటికీ ఆసీస్ ఆటగాళ్ల ప్రదర్శనతో భారత జట్టు ఓటమిపాలైంది. బౌలింగ్ విభాగంలో సీనియర్లు రాణించకపోవడం కూడా టీమిండియాకు ప్రతికూలంగా మారింది. తొలి వన్డే ద్వారా అరంగేట్రం చేసిన బరిందర్ స్రాన్ రాణించినప్పటికీ ఇతరుల నుంచి సహకారం కరవవ్వడంతో భారత్ విజయావకాశాలను దెబ్బతీసింది. భువనేశ్వర్, ఉమేష్ యాదవ్ ఆసీస్ బ్యాట్స్ మన్ పై ఎలాంటి ప్రభావం చూపకపోవడంతో రెండో వన్డేలో ఇషాంత్ శర్మను తీసుకోవాలని ధోనీ భావిస్తున్నాడు. పేస్ కు అనుకూలించే పెర్త్ పిచ్ కు గబ్బా స్టేడియం పూర్తి విభిన్నమైనదని, ఈ పిచ్ పై బరిందర్ ఎలాంటి ప్రదర్శన చేస్తాడోనని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సిరీస్ ను నెగ్గాలంటే తొలి వన్డేలో విఫలమైన ధావన్ రెండో వన్డేతో ఫాంలోకి రావాల్సిన అవసరం ఉంది. స్వల్ప మార్పులతో బరిలో దిగనున్న టీమిండియా రెండో వన్డేలో ఆసీస్ పై విజయం సాధించాలని భావిస్తోంది.

  • Loading...

More Telugu News