: ఢిల్లీ సమీపంలో దొంగలు- పోలీసుల మధ్య కాల్పులు


ఢిల్లీ సమీపంలోని ఘజియాబాద్ లో దొంగలు, పోలీసుల మధ్య కాల్పులు జరిగాయి. మీరట్ కు చెందిన ఓ వ్యాపారి వద్ద దొంగతనానికి పాల్పడిన దొంగలు, మోదీ నగర్ ప్రాంతంలోని చెరుకు తోటలో దాక్కుని ఉన్నారని పోలీసులకు పక్కా సమాచారమందింది. దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు చెరకు తోటను చుట్టుముట్టి కాల్పులు జరిపారు. దీంతో అప్రమత్తమైన దొంగలు ఎదురు కాల్పులు జరిపారు. రెండు వర్గాల మధ్య హోరాహోరీ కాల్పుల్లో ఓ పోలీస్ అధికారికి గాయాలయ్యాయి. ఈ ప్రాంతంలో ఫ్యాక్టరీలు కూడా ఉండడంతో అక్కడి నుంచి తప్పించుకున్న దొంగలు ఘజియాబాద్ చేరుకున్నారని సమాచారం. కాగా, పోలీసులు వారిని వెంబడిస్తున్నారు.

  • Loading...

More Telugu News