: సెల్ఫీకి రూల్సేమీ లేవు... ఎవరైనా నాతో సెల్ఫీ తీసుకోవచ్చు!: అఖిలేశ్ యాదవ్


తనతో తీసుకున్న సెల్ఫీని బయపెట్టిందన్న కారణంతో బీఎస్పీ అధినేత్రి మాయావతి ఓ మహిళకు అసెంబ్లీ టికెట్ నిరాకరించడంపై ఉత్తరప్రదేశ్ ముఖమంత్రి అఖిలేశ్ యాదవ్ స్పందించారు. ఈ విషయంలో తమకు ఎలాంటి రూల్స్ లేవని, ఎవరైనా సరే వచ్చి తనతో సెల్ఫీ దిగవచ్చని చెప్పారు. తమ పార్టీ చాలా ఉదారమైనదని సెల్పీ దిగినందుకు క్రమశిక్షణ చర్యలు తీసుకోమని, ఎవరైనా సెల్ఫీ దిగవచ్చని ఆయన అన్నారు. ఏమైనా ఈ సెల్ఫీ జబ్బును కేంద్రంలో అధికారం చేపట్టిన తర్వాత బీజేపీ అంటించిందని ఆయన ఆరోపించారు.

  • Loading...

More Telugu News