: కేంద్ర మంత్రి కనబడడం లేదని పోస్టర్లు అంటించిన నియోజకవర్గ ప్రజలు
కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ కనబడడం లేదని బీహార్ లోని అతని సొంత నియోజకవర్గంలో పోస్టర్లు వెలిశాయి. బీహార్ లోని నెవడా నియోజకవర్గం నుంచి బీజేపీ తరపున ఎంపీగా పోటీ చేసి విజయం సాధించిన గిరిరాజ్ సింగ్ మోదీ మంత్రి వర్గంలో బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. అయితే ఎన్నికైన నాటి నుంచి ఆయన నియోజకవర్గానికి ఒక్కసారి కూడా రాలేదని ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రజలు, 'ఎంపీ కనబడడం లేదు' అంటూ పోస్టర్లు కూడా అంటించారు. ఆయన ఎంపీ ల్యాండ్స్ నుంచి ఒక్క పైసా కూడా నియోజకవర్గానికి వెచ్చించలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. అంతే కాకుండా, నియోజకవర్గం ఎదుర్కొంటున్న సమస్యలను కూడా ఆ పోస్టర్లలో పేర్కొన్నారు. గతంలో పలు వ్యాఖ్యలతో వివాదాలు రాజేసిన గిరిరాజ్ కు ఈ వివాదం తలనొప్పిగా మారింది.