: జకార్తా పేలుళ్ల వీడియోను ట్విట్టర్లో పెట్టిన బాలీవుడ్ నటుడు


జకార్తా బాంబు పేలుళ్ల వీడియోను బాలీవుడ్ 'సీరియల్ కిస్సర్' ఇమ్రాన్ హష్మీ సోషల్ మీడియాలో పెట్టాడు. ఇండోనేషియా రాజధానిలో ఉన్న తన స్నేహితుడి ఆఫీసు కిటికీ నుంచి వీడియో షూట్ చేస్తుండగా పేలుళ్లు జరిగాయని, వాటిని కాప్చర్ చేసిన ఆ దృశ్యాలను తన స్నేహితుడు తనకు పంపాడని, వాటిని అభిమానుల కోసం పెడుతున్నానని ఇమ్రాన్ హష్మీ తెలిపాడు. కాగా, నేటి ఉదయం జకార్తాలో జరిగిన బాంబు పేలుళ్లలో ఏడుగురు మృతి చెందినట్టు అధికారులు ప్రకటించగా, బాంబు పేలుళ్లు జరిగిన ప్రదేశాల్లో మృతదేహాలు చెల్లాచెదురుగా పడిఉన్నాయని స్థానికులు వెల్లడించారు.

  • Loading...

More Telugu News